స్వశక్తి మహిళలకు ఆర్థిక నిర్వహణపై శిక్షణ
eenadu telugu news
Published : 29/07/2021 04:23 IST

స్వశక్తి మహిళలకు ఆర్థిక నిర్వహణపై శిక్షణ

మహిళలకు అవగాహన కల్పిస్తున్న ఆడిటర్‌ గోవర్ధన్‌

ధర్మారం, ఓదెల, న్యూస్‌టుడే: స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, వీవోఏలు, అన్ని గ్రామైక్య సంఘాల ప్రతినిధులకు ఆర్థిక నిర్వహణపై బుధవారం ధర్మారం, మంథని, ఓదెల మండల సమాఖ్య కార్యాలయాల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. సంఘం లావాదేవీలను రికార్డుల్లో నమోదు చేసుకునే అంశాలపై వివరించారు. ఆర్థిక నివేదికలు, అప్పుల నిర్వహణ, ఆర్థిక నియంత్రణ.. తదితర అంశాలపై సీబీవో ఆడిటర్‌ గోవర్ధన్‌ అవగాహన కల్పించారు. ధర్మారంలో మండల సమాఖ్య అధ్యక్షురాలు మార్క సంధ్య, ఏపీఎం కనకయ్య, సీసీలు సత్యనారాయణ, స్వామి, సంతోష్‌, అనిత, విజయలక్ష్మి తదితరులు, ఓదెలలో ఎంపీపీ కునారపు రేణుకాదేవి, డీపీఎం తిరుపతి, రిసోర్స్‌పర్సన్స్‌ లతామంగేశ్వరి, జొంగోని సదాశివ్‌, సిబ్బంది పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని