పీఆర్సీ అమలుకు డిమాండ్‌
eenadu telugu news
Published : 29/07/2021 04:23 IST

పీఆర్సీ అమలుకు డిమాండ్‌

మంథనిలో ధర్నా చేస్తున్న కార్మికులు

సుల్తానాబాద్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 30 శాతం పీఆర్సీని మున్సిపల్‌ సిబ్బంది, కార్మికులకు గత జూన్‌ నుంచి వర్తింపజేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం సుల్తానాబాద్‌లో మున్సిపల్‌ కార్మికులు కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో నాయకులు పాక మహేష్‌, శ్రావణ్‌, లక్ష్మన్‌, రాంమూర్తి, సదయ్య పాల్గొన్నారు.

మంథని గ్రామీణం: మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించాలంటూ బుధవారం మంథని మున్సిపల్‌ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. పీఎఫ్‌, ఈఎస్‌ఐ అమలు చేయాలని, బీమా పథకం ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. అనంతరం మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ శైలజకు వినతిపత్రం అందించారు. సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు గణేష్‌, నాయకులు రాజయ్య, గట్టయ్య పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని