బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ
eenadu telugu news
Published : 29/07/2021 04:23 IST

బాధ్యతగా పర్యావరణ పరిరక్షణ

మొక్క నాటుతున్న సర్పంచి పద్మ

సెంటినరీకాలనీ, న్యూస్‌టుడే: హరితహారంలో భాగంగా బుధవారం పన్నూరు పంచాయతీ ఆధ్వర్యంలో ఉద్యానవన పాలిటెక్నిక్‌ కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. సర్పంచి అల్లం పద్మ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని విద్యార్థులకు సూచించారు. ప్రధానాచార్యురాలు ప్రభావతి, పంచాయతీ కార్యదర్శి ఆకాష్‌, వార్డు సభ్యులు, ఆచార్యులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని