హెపటైటిస్‌-బి నివారణపై అవగాహన
eenadu telugu news
Published : 29/07/2021 04:23 IST

హెపటైటిస్‌-బి నివారణపై అవగాహన

మాట్లాడుతున్న డాక్టర్‌ వెంకటేశ్వర్లు, చిత్రంలో క్లబ్‌ ప్రతినిధులు

గోదావరిఖని పట్టణం, న్యూస్‌టుడే: రామగుండం లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో హెపటైటిస్‌ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బుధవారం అవగాహన కల్గించారు. స్థానిక లయన్స్‌ భవన్‌లో లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు మేడిశెట్టి గంగాధర్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్‌ వెంకటేశ్వర్లు, డాక్టర్‌ రాజశేఖర్‌రెడ్డి, డాక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొని హెపటైటిస్‌-బి లక్షణాలు, సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలపై సూచనలు ఇచ్చారు. రామగుండం లయన్స్‌ క్లబ్‌ కార్యదర్శి తిలక్‌చక్రవర్తి, కోశాధికారి మనోజ్‌కుమార్‌ అగర్వాల్‌, అల్తాప్‌హుస్సేన్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని