ఆజాదీ కా అమృత్‌ రన్‌
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

ఆజాదీ కా అమృత్‌ రన్‌

2కె రన్‌లో కలెక్టర్‌ కర్ణన్‌

కరీంనగర్‌ క్రీడా విభాగం: ఆరోగ్యవంతమైన సమాజం కోసం ప్రతి ఒక్కరు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని జిల్లా కలెక్టర్‌ వి.కర్ణన్‌ అన్నారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన ఆజాదీ కా అమృత్‌ రన్‌ను శనివారం కరీంనగర్‌ అంబేడ్కర్‌ స్టేడియంలో సీపీ సత్యనారాయణతో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. అంబేడ్కర్‌ స్టేడియం వద్ద ప్రారంభమైన 2కె రన్‌ భగత్‌నగర్‌, కలెక్టరేట్‌ మీదుగా తెలంగాణచౌక్‌ వద్ద ముగిసింది. కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ గరిమా అగ్రవాల్‌, అదనపు కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, డీవైఎస్‌వో కె.రాజవీరు, నెహ్రూ యువ కేంద్రం కో-ఆర్డినేటర్‌ రాంబాబు, ఒలింపిక్‌ అసోసియేషన్‌ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్‌ అధికారులు బాలరాజు, కెప్టెన్‌ కిరణ్‌ జ్యోతి, డాక్టర్‌ రజనీదేవి తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని