ఉద్యమంలా కరోనా వ్యాక్సినేషన్‌
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

ఉద్యమంలా కరోనా వ్యాక్సినేషన్‌

దృశ్య సమీక్షలో మంత్రి ఈశ్వర్‌

సమీక్షలో మంత్రి

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లాలో ఉద్యమంలా కరోనా వ్యాక్సినేషన్‌ నిర్వహించాలని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆదేశించారు. ప్రత్యేక వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌పై శనివారం ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులతో జూమ్‌ దృశ్య సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రంలో 2 కోట్ల డోసులు పూర్తిచేసినట్లు వివరించారు. కరోనా నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగించేందుకు రోజుకు 3 లక్షల మందికి టీకా వేసేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టారని తెలిపారు. జిల్లా కలెక్టర్‌ గుగులోతు రవి మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరికి వ్యాక్సిన్‌ వేసేందుకు 140 గ్రామీణ, 134 పట్టణ బృందాలతో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. జిల్లాలో 6,53,480 మంది 18 సంవత్సరాలు నిండిన వారున్నారని వీరిలో 42.08 శాతం మందికి తొలిడోసు, 17శాతం మందికి రెండోడోసు వ్యాక్సిన్‌ పూర్తయిందని తెలిపారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో జగిత్యాల, కోరుట్ల శాసనసభ్యులు డాక్టర్‌ ఎం.సంజయ్‌కుమార్‌, కె.విద్యాసాగర్‌రావు, జగిత్యాల పురపాలక సంఘం ఛైర్‌పర్సన్‌ బోగ శ్రావణి, రాయికల్‌ పురపాలక సంఘ అధ్యక్షుడు మోర హన్మాండ్లు, జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కోరుట్ల వైద్యాధికారి సరిగ్గా స్పందించడం లేదని మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ లావణ్య తెలపగా ఫిర్యాదును పరిశీలించామని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని