2 నుంచి న్యాయ అవగాహన సదస్సులు
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

2 నుంచి న్యాయ అవగాహన సదస్సులు

సదస్సులో పాల్గొన్న జడ్జిలు రవి, భార్గవి, ప్రియాంక

గోదావరిఖని: న్యాయ అవగాహన సదస్సులను విజయవంతం చేయాలని గోదావరిఖని ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ జడ్జి పర్వతపు రవి కోరారు. అక్టోబరు 2 నుంచి నవంబరు 14 వరకు నిర్వహించే న్యాయ అవగాహన సదస్సులను ప్రతి గ్రామంలో నిర్వహించాలని, తగిన ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఈ మేరకు శనివారం కోర్టు ఆవరణలో ప్యానల్‌ న్యాయవాదులు, పారా లీగల్‌ వాలంటీర్లు, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీలతో సమావేశమయ్యారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి.సుజయ్‌, మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి భార్గవి, రెండో అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి ప్రియాంక, మండల లీగల్‌ సర్వీసెస్‌ కమిటీ ప్యానల్‌ అడ్వకేటు శ్రీనివాస్‌, ప్రదీప్‌కుమార్‌, ప్రవీణ్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని