పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ
eenadu telugu news
Published : 19/09/2021 03:01 IST

పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ

సదస్సులో జిల్లా పాలనాధికారిణి సంగీత, అధికారులు

పెద్దపల్లి కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా పాలనాధికారిణి డాక్టర్‌ సర్వే సంగీత సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్‌ శనివారం నిర్వహించిన దూరదృశ్య మాధ్యమ సదస్సులో ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఓటరు నమోదు, జాబితా సవరణ తదితర అంశాలను వివరించారు. జాబితా సవరణకు జిల్లాలో ఇప్పటివరకు 13,523 దరఖాస్తులు స్వీకరించినట్లు వెల్లడించారు. వీటిలో 9,643 ఆమోదించామన్నారు. వివిధ కారణాలతో 3482 దరఖాస్తులను తిరస్కరించామని, 398 పెండింగ్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెలా ఈవీఎం భధ్రపరిచిన గోదామును పరిశీలిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్‌ నర్సింహమూర్తి, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్‌ ప్రవీణ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని