గిరిపుత్రులు అన్నిరంగాల్లో సత్తా చాటాలి
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

గిరిపుత్రులు అన్నిరంగాల్లో సత్తా చాటాలి


మాట్లాడుతున్న ఎస్పీ రాంరెడ్డి

వీర్నపల్లి, న్యూస్‌టుడే: జాతి ఐక్యతను నిలబెట్టుకునేందుకు ప్రతి గిరిజనుడు కృషి చేయాలని ఇటీవల పదోన్నతి పొందిన ఎస్పీ భూక్య రాంరెడ్డి(సీఐడీ, కరీంనగర్‌) పేర్కొన్నారు. వీర్నపల్లి మండలం జవహార్‌లాల్‌తండా పరిధిలోని బంగిరెడ్డితండాలో ఆదివారం సేవాలాల్‌ నవరాత్రి ఉత్సవాల ముగింపులో పాల్గొన్నారు. అన్ని రంగాల్లో గిరిపుత్రులు సత్తాచాటాలన్నారు. సేవాలాల్‌ మహరాజ్‌కి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం బోగ్‌ బండార్‌, అన్నదానం చేశారు. సర్పంచులు శ్రీనివాస్‌, రవినాయక్‌, ఎంపీటీసీ సభ్యురాలు పద్మ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌(సర్వే, కరీంనగర్‌) సేవ్యానాయక్‌, లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గజన్‌లాల్‌, చందునాయక్‌, రాందాస్‌, చంద్రం, సంతోష్‌, నవీన్‌, ఎస్‌పీనాయక్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని