ముస్తాబాద్‌లో 24న ప్రజా సంగ్రామయాత్ర
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

ముస్తాబాద్‌లో 24న ప్రజా సంగ్రామయాత్ర

మాట్లాడుతున్న కటకం మృత్యుంజయం

ముస్తాబాద్‌ : మండలంలో ఈ నెల 24వ తేదీన భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేపట్టే ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, భాజపా రాష్ట్ర నాయకుడు కటకం మృత్యుంజయం పిలుపునిచ్చారు. ముస్తాబాద్‌లో రైతు ఫంక్షన్‌ హలులో మండలాధ్యక్షుడు కార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో మండల, జిల్లాస్థాయి నాయకులతో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చీకోడ్‌, మొర్రాయిపల్లె, ముస్తాబాద్‌, పోతుగల్‌, గన్నెవారిపల్లె, సేవాలాల్‌తండా గ్రామాల మీదుగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుందన్నారు. పట్టణ అధ్యక్షుడు మహేందర్‌, జిల్లా ఇన్‌ఛార్జి మోహన్‌రెడ్డి, యాత్ర ప్రముఖ్‌ కటకం శ్రీధర్‌పంతులు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్‌రెడ్డి, కార్యదర్శి మీస సంజీవ్‌, మండల ప్రధాన కార్యదర్శులు కోల కృష్ణ.సౌవుల్ల క్రాంతి, మీస శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని