లారీని ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు
eenadu telugu news
Published : 20/09/2021 03:25 IST

లారీని ఢీకొన్న కారు.. ముగ్గురికి గాయాలు

తిరుమల వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి పరిస్థితి విషమం


108 వాహనంలో క్షతగాత్రుల తరలింపు

అద్దంకి: ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా మలుపు తిరగడంతో వెనుకగా వస్తున్న కారు ఢీకొంది. ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్‌ జిల్లా జగిత్యాలకు చెందిన చిన్నమల విజయ, ఆమె కుమారులు, కోడళ్లు నవీన్‌ - లహరి, సంతోష్‌ - సంజన; చిన్నారులు శశివర్ధన్‌, శ్రీవత్సల్‌, అమ్ములు... తిరుమల శ్రీవారి దర్శనానికి శనివారం రాత్రి కారులో బయలుదేరారు. ఆదివారం ఉదయానికి ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సాధూనగర్‌ చేరుకున్నారు. ఇక్కడ ముందు వెళ్తున్న లారీ ఒక్కసారిగా మలుపు తిరగడంతో... వెనుకగా వస్తున్న వీరి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో విజయకు తీవ్రగాయాలు కాగా... ఆమె కుమారులు నవీన్‌, సంతోష్‌లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం విజయను ఒంగోలు తరలించారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు బాధితులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని