దివ్యాంగులకు చేయూత
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

దివ్యాంగులకు చేయూత

ఉపకరణాలు ఇస్తున్న మంత్రి ఈశ్వర్‌, తదితరులు

జగిత్యాల, న్యూస్‌టుడే: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా చేయూతనిస్తోందని రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో గురువారం దివ్యాంగులకు వివిధ రకాల ఉపకరణాలను అందించారు. గత ఆర్థిక సంవత్సరంలో 16,423 మందికి 11 రకాల ఉపకరణాలు ఇవ్వగా జిల్లాలో 436 మందికి ఇచ్చామన్నారు. దివ్యాంగులతోపాటు ఇంటర్‌ ఉత్తీర్ణులైన దివ్యాంగులకు రూ.90 వేల విలువ చేసే ద్విచక్రవాహనాలు ఉచితంగా ఇస్తున్నామని బ్యాంకులతో సంబంధం లేకుండా స్వయం ఉపాధి కోసం రూ.3 లక్షల సాయం చేస్తున్నామన్నారు. గత సంవత్సరం వందశాతం రాయితీతో 589 మందికి రూ.4.67 కోట్ల రాయితీ ఇచ్చామని జిల్లాలోని 16,737 మంది దివ్యాంగులకు నెలనెలా రూ.3,016 చొప్పున రూ.5.04 కోట్ల పింఛన్‌ ఇస్తున్నామని వయోవృద్ధులకు రూ.2016 చొప్పున రూ.9.53 కోట్ల పింఛన్లు ఇస్తున్నామన్నారు. దివ్యాంగులకు 5 శాతం రెండు పడకల గదుల ఇళ్లు కేటాయిస్తున్నామని రాష్ట్రం రెండుసార్లు జాతీయ అవార్డు అందుకుందని మంత్రి అన్నారు. జడ్పీ ఛైర్‌పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌, జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ వొద్దినేని హరిచరణ్‌రావు, పుర ఛైర్‌పర్సన్‌ శ్రావణి పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని