దళితబంధు అమలుకు రాజీనామా చేయాలి
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

దళితబంధు అమలుకు రాజీనామా చేయాలి

తహసీల్దారుకు వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

మల్యాల, న్యూస్‌టుడే: ఎస్సీ నియోజకవర్గాల్లో దళిత బంధు అమలు కోసం ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాలని పలువురు కాంగ్రెస్‌ నాయకులు డిమాండు చేశారు. దళిత గిరిజన ఆత్మగౌరవం పేరుతో మల్యాలలో గురువారం కాంగ్రెస్‌ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా టీపీసీసీ అధికార ప్రతినిధి మేడిపెల్లి సత్యం, నాయకులు అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ వస్తే అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆశపడితే అధికార పార్టీ నేతలు అవినీతితో కోట్లాది ప్రజాధనం లూటీ చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాలే తప్ప తెరాస ప్రభుత్వ పాలనలో దళితులకు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోలేదని పేర్కొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు పద్మ, మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, మాజీ జడ్పీటీసీ సభ్యులు శోభారాణి, ఆదిరెడ్డి, మాజీ ఎంపీపీలు ఆనందరెడ్డి, రాజలింగం, మాజీ సర్పంచులు లక్ష్మినారాయణ, శ్రీనివాస్‌గౌడ్‌, మొండయ్య, మండల యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు లక్ష్మణాచారి, నియోజకవర్గ అధ్యక్షుడు శంకర్‌, కృష్ణారెడ్డి, మండల నాయకులు ఇమామ్‌, తిరుపతి, లక్ష్మణ్‌, రామాంజనేయులు, హరినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని