వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

వ్యవసాయం లాభదాయకంగా ఉండాలి


ఆవునూర్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

ముస్తాబాద్‌, న్యూస్‌టుడే: చేసే వ్యవసాయం రాబోయే తరాలకు లాభదాయకంగా ఉండాలని కలెక్టర్‌ అనురాజ్‌ జయంతి పేర్కొన్నారు. గురువారం ముస్తాబాద్‌ మండలం ఆవునూర్‌లో నిర్వహించిన యాసంగి పంటల మార్పిడి రైతు అవగాహన సమావేశానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. వ్యవసాయం గురించి రైతులకే ఎక్కువగా తెలుసని, మీరు చేసే వ్యవసాయం రాబోయే ఇరవై తరాలకు ఆదర్శంగా ఉండాలని తెలిపారు. వరి కాకుండా ఇతర పంటలపై దృష్టిసారించాలన్నారు. జిల్లాల్లో చాలా గ్రామాలు ఎక్కువగా 80 నుంచి 90 శాతం వరకు వరినే పండిస్తున్నట్లు తెలిపారు. వరికి మందులు, నీరు చాలా అవసరమని పేర్కొన్నారు. తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం పండిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలు చేయడానికి గిడ్డంగులు సరిపోవడం లేదన్నారు. వచ్చే యాసంగిలో ఇతర పంటలతో పాటు సన్నరకం వరిపై దృష్టిసారించాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచి బద్ది కళ్యాణి, ఎంపీపీ జనగామ శరత్‌రావు, జడ్పీటీసీ సభ్యుడు గుండం నర్సయ్య, రైతు బంధు జిల్లా సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మండల అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాల్‌రావు, ఏఎంసీ ఛైర్మన్‌ శీలం జానాభాయి, ఎంపీటీసీ సభ్యురాలు లలిత, జిల్లా వ్యవసాయాధికారి రణధీర్‌రెడ్డి, జిల్లా ఉద్యానవన అధికారిణి జ్యోతి, మండల వ్యవసాయాధికారి వెంకటేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

అంతర్జాతీయ డ్రైవింగ్‌ స్కూల్‌ సందర్శన

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: తంగళ్లపల్లి మండలం మండేపల్లి శివారులోని అంతర్జాతీయ డ్రైవింగ్‌ శిక్షణ, పరిశోధన కేంద్రాన్ని గురువారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సందర్శించారు. శిక్షణ కేంద్రంలో ఏర్పాటు చేసిన వసతులను, శిక్షణకు సంబంధించిన పరికరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. శిక్షణ ఏ విధంగా ఇస్తున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. యువత పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకొని మంచి నైపుణ్యం గల డ్రైవర్లగా పేరు తెచ్చుకోవాలన్నారు. ఏమైన సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ నుజూం, తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని