ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న అధికార పార్టీ
eenadu telugu news
Published : 24/09/2021 02:50 IST

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న అధికార పార్టీ

మాజీమంత్రి ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: అధికారపార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, వందలాది మంది నాయకులు హుజూరాబాద్‌లో మోహరించి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మాజీమంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్‌ ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ గ్రామాల్లో సంఘాల వారీగా ధావత్‌లు కోనసాగుతూనే ఉన్నాయన్నారు. లిక్కర్‌ లోడ్లు దింపి చివరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధావత్‌లలో పాల్గొని స్వయంగా వారే వడ్డిస్తున్నారని ఆరోపించారు. అధికారపార్టీ కుట్రలు, అప్రజాస్వామిక పద్ధతులను ప్రజాస్వామిక వాదులు, రాజకీయ విజ్ఞులు నిలువరించడంలో భాగస్వాములు కావాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ధర్మారావు, జడ్పీ మాజీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని