బస్టాండ్‌లో 10 కిలోల గంజాయి పట్టివేత
eenadu telugu news
Published : 25/09/2021 03:56 IST

బస్టాండ్‌లో 10 కిలోల గంజాయి పట్టివేత


పట్టుబడిన గంజాయిని పరిశీలిస్తున్న పోలీసులు

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ బస్టాండ్‌లో శుక్రవారం రాత్రి పోలీసులు చేపట్టిన తనిఖీల్లో 10 కిలోల గంజాయి పట్టుబడింది. కరీంనగర్‌ అదనపు డీసీపీ ఎస్‌.శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి ప్రయాణికుల వద్ద ఉన్న సామగ్రిని బాంబ్‌ స్క్వాడ్‌, డాగ్‌ స్క్వాడ్‌లతో క్షుణ్ణంగా పరిశీలించారు. నిజామాబాద్‌ ప్లాట్‌ఫాం వద్దకు చేరుకోగానే గుర్తు తెలియని వ్యక్తి కళాశాల సంచిలో తరలించేందుకు సిద్ధంగా ఉన్న 10 కిలోల గంజాయిని పట్టుకున్నారు. పరిసర ప్రాంతాల్లో వెతికినా సంచి వదిలిన వ్యక్తి దొరకలేదు. అక్కడి సమీపంలోనే సుల్తానాబాద్‌కు చెందిన మామిడాల శ్రీకాంత్‌ పట్టుకున్న రెండు సంచులు పరిశీలించగా అందులో రూ.87 వేల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు లభించాయి. బస్టాండ్‌లో అనుమానితుల వేలిముద్ర యంత్రంతో పరిశీలించి వారిని అదుపులోకి తీసుకుని ఒకటో ఠాణాకు తరలించారు. నగర ఏసీపీ శ్రీనివాసరావు, ఇన్‌స్పెక్టర్లు నటేష్‌, లక్ష్మీబాబు, శ్రీనివాస్‌, ఎస్సైలు నరేష్‌, శ్రీనివాస్‌, సురేందర్‌, లక్ష్మారెడ్డి ఉన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని