గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం


మాట్లాడుతున్న అదనపు పాలనాధికారి కుమార్‌దీపక్‌, చిత్రంలో డీఆర్డీవో శ్రీధర్‌

పెద్దపల్లి, న్యూస్‌టుడే: గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా అదనపు పాలనాధికారి(స్థానిక సంస్థలు) కుమార్‌దీపక్‌ పేర్కొన్నారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో సర్పంచి సంవాద చర్చా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆజాదీ అమృత్‌ మహోత్సవంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా శ్రమదాన కార్యక్రమాలు, స్వచ్ఛభారత్‌ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, ఇంకుడుగుంతలు, తడి, పొడి చెత్త సేకరణ, వర్మి కంపోస్టు ఎరువుల తయారీ, పంచాయతీలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఇంకుడుగుంతలు, మరుగుదొడ్ల నిర్మాణ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సమావేశంలో డీఆర్డీవో శ్రీధర్‌, డీపీవో చంద్రమౌళి, వివిధ గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.

ప్రభుత్వ పాఠశాలలో అదనపు కలెక్టర్‌ తనిఖీ

ఓదెల : ఓదెలలోని జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్‌(స్థానిక సంస్థలు) కుమార్‌ దీపక్‌ శనివారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల రికార్డులు, మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఆవరణలో పారిశుద్ధ్య నిర్వహణ తీరును చూశారు. అనంతరం మండలకేంద్రంలోని సెగ్రిగేషన్‌ షెడ్డును, హరిపురంలో బృహత్‌ పల్లె ప్రకృతివనాన్ని పరిశీలించి అధికారులు, సిబ్బందికి సూచనలు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో జి.సత్తయ్య, ఎంపీవో వాజిద్‌, ఏంపీవో కొంరయ్య పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని