భారీ వర్షం.. కాలనీలు జలమయం
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

భారీ వర్షం.. కాలనీలు జలమయం


కోరుట్ల ప్రకాశంరోడ్‌లో నిలిచిన వర్షపు నీరు

కోరుట్ల, న్యూస్‌టుడే: కోరుట్ల పట్టణంలో శుక్రవారం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఆదర్శనగర్‌, ప్రకాశంరోడ్‌, రథాలపంపు, ముత్యాలవాడ, గోవిందగిరి కాలనీలు జలమయమయ్యాయి. ప్రకాశంరోడ్‌లోని పలుకాలనీల్లో వర్షపు నీరు రోడ్లుపై రెండు అడుగులమేర నిల్వ చేరడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు తీవ్ర ఇబ్బందిపడ్డారు. ఆదర్శనగర్‌లోని రోడ్లపై వరద నీరు ప్రవహిస్తుంది. ఖాళీస్థలాల్లో నీరు నిల్వ ఉండటంతో కుంటలను తలపిస్తున్నాయి. వర్షం కురిసి 24 గంటలు గడిచినా వరద నీరు భారీగా ప్రవహించడంతో లోతట్టు ప్రాత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


తహసీల్దార్‌ కార్యాలయం ఆవరణలో రోడ్డుపై ప్రవహిస్తున్న నీరు


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని