బహుజన జైత్రయాత్రకు భారీ ఏర్పాట్లు
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

బహుజన జైత్రయాత్రకు భారీ ఏర్పాట్లు

నేడు జగిత్యాలలో బీఎస్‌పీ సభ


మినీ స్టేడియంలో ఏర్పాట్లు

జగిత్యాల, న్యూస్‌టుడే: జిల్లా కేంద్రంలో బహుజన సమాజ్‌ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం బహుజన జైత్రయాత్ర పేరిట సభ జరగనుంది. రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతం, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి, రాష్ట్ర కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌, బీఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్‌ తదితరులు పాల్గొనే సభ కోసం మినీస్టేడియంలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో తొలిసభ కావటంతో జగిత్యాల జిల్లాతోపాటు చుట్టుపక్కల జిల్లా నుంచి అధిక సంఖ్యలో ప్రజలు రావొచ్చని భావిస్తున్నారు. రాజ్యసభ సభ్యుడు రాంజీగౌతం, కోఆర్డినేటర్‌ డాక్టర్‌ ఆర్‌.ఎస్‌.ప్రవీణ్‌కుమార్‌కు జగిత్యాల-కరీంనగర్‌ రహదారిపై జెఎన్‌టీయు ఎక్స్‌రోడ్డు వద్ద స్వాగతం పలకాలని బీఎస్‌పీ నాయకులు నిర్ణయించారు. సాయంత్రం 5 గంటలకు బహిరంగసభ జరగనుండగా ధరూర్‌క్యాంపు ఎస్సారెస్పీ అతిథి గృహం నుంచి మినీస్టేడియం వరకు ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని