అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ


ద్విచక్ర వాహనాల ర్యాలీ

జగిత్యాల, న్యూస్‌టుడే: భారత్‌ బంద్‌లో భాగంగా సోమవారం బంద్‌ విజయవంతం చేయాలని కోరుతూ జగిత్యాలలో శనివారం అఖిలపక్షం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఇందిరాభవన్‌, టవర్‌, కొత్తబస్టాండ్‌ మీదుగా తహసీల్‌చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి కేంద్రం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు భృతి ఇవ్వడంతోపాటు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరుతూ బంద్‌ విజయవంతం చేయాలని ఈ సందర్భంగా నాయకులు కోరారు. జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మన్‌కుమార్‌, బండ శంకర్‌, గిరినాగభూషణం, పురపాలక ఫ్లోర్‌ లీడర్‌ కల్లెపల్లి దుర్గయ్య, టి.దేవేందర్‌రెడ్డి, రాజేందర్‌, కోర్టు శ్రీను, గుండా మధు, రియాజ్‌, పులి రాము, నేహాల్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని