సూదుల్లేవ్
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

సూదుల్లేవ్

తగ్గిన సరఫరాతో కరోనా టీకా పంపిణీకి ఆటంకం

కరీంనగర్‌ వైద్యవిభాగం, న్యూస్‌టుడే

టీకా వేస్తున్న వైద్య సిబ్బంది

కరోనా మహమ్మారిని అదుపులో పెట్టేందుకు చేపట్టిన టీకా కార్యక్రమం ముమ్మరంగా జరుగుతున్నప్పటికీ సరిపడా సూదులు సరఫరా చేయకపోవడంతో సిబ్బంది, అధికారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో పాటు 139 ఆరోగ్య ఉప కేంద్రాలు నగర పురపాలికల పరిధిలో 146 కేంద్రాలను అదనంగా ఏర్పాటు చేసే టీకాలు వేస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భవనాలను కూడా వినియోగిస్తున్నారు. ఈ నెల 24వ తేదీ వరకు 1,25,912 మందికి టీకా వేశారు. ప్రతిరోజు దాదాపు 10 వేల మందికి పంపిణీ చేస్తున్నారు. తాజాగా శనివారం 18 వేల మందికి సరిపడా వ్యాక్సిన్‌ ఇస్తే 10 వేల సూదులు మాత్రమే పంపించారు. అంతకుముందు 16 వేల మందికి సరిపడా వ్యాక్సిన్‌ ఇస్తే 10 వేల సూదులు సరఫరా చేశారు. సూదులు కొరత ఉండటంతో స్థానికంగా కొనుగోలు చేయడానికి వీలు లేదు. హైదరాబాద్‌ నుంచి సరఫరా కావాల్సిందేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి.

సరిపోని స్థానిక సర్దుబాటు

సూదుల కొరతతో టీకా కార్యక్రమం ఆగకూడదని జిల్లా ఇమ్యూనైజేషన్‌ విభాగంలో పిల్లల టీకా మందుకు ఉపయోగించే సూదులు(సిరంజిలు) సర్దుబాటు చేస్తున్నామని జిల్లా ఇమ్యూనైజేషన్‌ అధికారి డాక్టర్‌ సాజిదా తెలిపారు. కరీంనగర్‌తో పాటు హుజూరాబాద్‌ నుంచి కూడా తెప్పించామని పేర్కొన్నారు. కార్యక్రమం అన్ని ప్రాంతాలలో చురుకుగా సాగుతుందని సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని