బీసీ కమిషన్‌ ఛైర్మన్‌కు ఘన స్వాగతం
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

బీసీ కమిషన్‌ ఛైర్మన్‌కు ఘన స్వాగతం


అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న వకుళాభరణం కృష్ణమోహన్‌రావు

హుజూరాబాద్‌ పట్టణం, హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఛైర్మన్‌గా డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు నియామకమై పదవీ బాధ్యతలు తీసుకున్న తర్వాత మొదటిసారిగా హుజూరాబాద్‌కు రావడంతో బీసీ సంఘాల నేతలు శనివారం ఆయనకు ఘన స్వాగతం పలికారు. కేసీ క్యాంపు వద్దకు ద్విచక్రవాహనాలతో ర్యాలీగా తరలివచ్చారు. కృష్ణమోహన్‌రావుకు పుష్పగుచ్ఛాలను అందజేసి స్వాగతించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఆయనతో పాటు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ శ్రీనివాస్‌, మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ వడ్లూరి విజయ్‌కుమార్‌, బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి రావుల అశోక్‌, నాయకులు బండారి సదానందం, కాజిపేట కృష్ణ, ఉన్నారు.

* వకుళాభరణం కృష్ణమోహన్‌రావును హుజూరాబాద్‌లోని ఆయన నివాసంలో శనివారం రాత్రి కరీంనగర్‌ జిల్లా పాలనాధికారి ఆర్‌.వి.కర్ణన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్ఛాన్ని అందించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని