హుజూరాబాద్‌ను దావత్‌లకు అడ్డాగా మార్చిన మంత్రులు
eenadu telugu news
Published : 26/09/2021 03:46 IST

హుజూరాబాద్‌ను దావత్‌లకు అడ్డాగా మార్చిన మంత్రులు

మాజీ మంత్రి ఈటల


భాజపాలో చేరిన వారికి కండువా కప్పుతున్న ఈటల రాజేందర్‌

వీణవంక, న్యూస్‌టుడే: ఎన్నడూ రాని మంత్రులు, ఎమ్మెల్యేలు హుజూరాబాద్‌లో తిరుగుతూ నియోజకవర్గాన్ని దావత్‌లకు అడ్డాగా మార్చారని మాజీ మంత్రి భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. శనివారం మల్లన్నపల్లి గ్రామానికి రాగ కోలాటాలు, డప్పు చప్పుళ్లతో ఘన స్వాగతం పలికారు. పలు పార్టీలకు చెందిన నాయకులు, యువకులు, మహిళలు భాజపాలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. నా వెంట ఎవరిని ఉండకుండా చేస్తారట చివరకు నా డ్రైవర్‌ను, వంట మనిషిని సైతం ఉండనివ్వరట కానీ, ప్రజలంతా నా వెంటే ఉన్నారని మరిచిపోవద్దన్నారు. సమావేశంలో సర్పంచి బొబ్బల విజయ్‌కుమార్‌రెడ్డి, మండల భాజపా అధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, పుల్లూరి కుమార్‌, మారముళ్ల కొమురయ్య, నరేశ్‌గౌడ్‌ పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని