చిరుతపులి వచ్చిందంటూ వదంతులు
eenadu telugu news
Published : 19/10/2021 04:55 IST

చిరుతపులి వచ్చిందంటూ వదంతులు

మార్కెట్‌యార్డులో పరిశీలిస్తున్న పోలీసులు

కరీంనగర్‌ సంక్షేమ విభాగం, నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా కేంద్రంలో చిరుత పులి సంచరించినట్లు వదంతులు వ్యాపించాయి. స్థానికుల కథనం మేరకు.. జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు రేకులపై సోమవారం రాత్రి 8గంటల ప్రాంతంలో చిరుతపులిని చూసినట్లు స్థానికులు తెలిపారు. శబ్దం చేయడంతో రేకులపై నుంచి  నడిచి వెళ్లిందని తెలిపారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా మూడో ఠాణా సీఐ దామోదర్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెండు గంటలు గాలించినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. అటవీ శాఖ అధికారులు స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం చుట్టుపక్కల ప్రదేశాలను కలియతిరిగారు. ఎలాంటి ఆనవాళ్లు కనిపించకపోవడంతో వారు చెప్పిన వివరాలను బట్టి చూస్తే అటవీ జంతువు కాదని పిల్లి కావొచ్చనే సందేహం వ్యక్తం చేశారు. మంగళవారం ఉదయం సంఘటన స్థలానికి చేరుకుని ఆనవాళ్లు సేకరిస్తామని అటవీ శాఖ క్షేత్రస్థాయి అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని