రూ.పది లక్షలు అన్ని కులాలకు ఇవ్వాలి
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

రూ.పది లక్షలు అన్ని కులాలకు ఇవ్వాలి

మాజీమంత్రి ఈటల రాజేందర్‌

ప్రసంగిస్తున్న మాజీమంత్రి ఈటల రాజేందర్‌

వీణవంక, న్యూస్‌టుడే: దళితబంధు ఇవ్వడంతోపాటు అన్ని కులాల వారికి రూ.పది లక్షలు ఇవ్వాలని మాజీ మంత్రి భాజపా నేత ఈటల రాజేందర్‌ అన్నారు. గంగారం, ఎలబాక, మామిడాలపల్లి, ఇప్పలపల్లి, చల్లూరులో ఎన్నికల ప్రచారంలో సోమవారం పాల్గొన్నారు. గంగారం గ్రామానికి చెందిన సామాజిక వేత్త, జాతీయ యువజన అవార్డు గ్రహీత నరహరి సుధాకర్‌రెడ్డి, చల్లూరు మాజీ ఉపసర్పంచి గూడెపు సమ్మయ్య తన అనుచరులతో భాజపాలో చేరగా ఈటల వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఈటల మాట్లాడుతూ....కేసీఆర్‌ ప్రభుత్వంలో బానిసత్వం నుంచి బయటపడి గట్టిగా మాట్లాడుతున్నందుకు గర్వంగా ఉందన్నారు.  రైతు బంధు కోట్ల రూపాయలు ఉన్న వారికి ఇవ్వవద్దని అన్నాను. కౌలు రైతులకు ఇవ్వాలని అడిగానని ఈటల తెలిపారు. సంక్షేమ పథకాలు పేదలకు అందాలని అంటే...నేను సంక్షేమ పథకాలు వద్దంటున్నానని తెరాస నేతలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్‌, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, నాయకులు రామిడి ఆదిరెడ్డి, పుప్పాల రఘు, పుల్లూరి కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని