కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం
eenadu telugu news
Updated : 19/10/2021 05:24 IST

కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం

మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

ఎన్నికల ప్రచారంలో శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌, చిత్రంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం జీఎస్టీని అమలు చేసిన సమయంలో మద్దతు కోసం మొదట సంతకం చేసింది తెరాస ప్రభుత్వమేనని, కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసినప్పుడు సైతం తెరాస ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిందని మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సోమవారం ఆరోపించారు. కాంగ్రెస్‌ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణికం ఠాగూర్‌తో కలిసి కాంగ్రెస్‌ శ్రేణులు జమ్మికుంట పట్టణంలోని మోత్కులగూడెం చౌరస్తా నుంచి గాంధీచౌక్‌ వరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా భారీర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో పూర్తిగా విఫలం చెందాయన్నారు. మాజీ ఎంపీలు మధుయాస్కీ, పొన్నం ప్రభాకర్‌, రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక ముఖ్యమంత్రి కేసీఆర్‌ రూ.కోట్ల వ్యయంతో తన ఇంటిని అభివృద్ధి చేసుకున్నాడని ఆరోపించారు. ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్‌ పరం చేస్తున్న భాజపాకు, నిరంకుశ పాలనతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన తెరాసకు ఉప ఎన్నికలో ఓటుతోనే తగిన గుణపాఠం చెప్పాలన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భాజపా, రాష్ట్రంలో ఉన్న తెరాస ప్రభుత్వాలు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో దొందూ..దొందేనని అన్నారు. కవ్వంపల్లి సత్యనారాయణ, పత్తి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని