ఈవీఎంల ర్యాండమైజేషన్‌
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

ఈవీఎంల ర్యాండమైజేషన్‌

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఈవీఎంల ర్యాండమైజేషన్‌ నిర్వహించారు. జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ మాట్లాడుతూ.. ఈవీఎంల మొదటి స్థాయి పరిశీలన, తనఖీ ఇదివరకే పూర్తి చేశామన్నారు. ప్రస్తుతం 469 బ్యాలెట్‌ యూనిట్లు, 85 వీవీ ప్యాట్లను హుజూరాబాద్‌ శాసనసభ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. మంగళవారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవీఎంల గోదాం నుంచి బ్యాలెట్‌ యూనిట్లు, వీవీ ప్యాట్లను హుజూరాబాద్‌ పంపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో పలు పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని