రూ.9 లక్షల నగదు స్వాధీనం
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

రూ.9 లక్షల నగదు స్వాధీనం

కరీంనగర్‌ నేరవార్తలు, న్యూస్‌టుడే: కరీంనగర్‌ రెండో ఠాణా పరిధిలోని తెలంగాణ చౌక్‌ వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రూ.9 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 11 కేసుల్లో 28 మందిని స్థానిక తహసీల్దార్ల ఎదుట బైండోవర్‌ చేశారు. ఎన్నికల నియమావళి, కరోనా నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి జమ్మికుంటలో ఒక కేసు నమోదు చేసినట్లు కమిషనరేట్ కార్యాలయం తెలిపింది. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కరీంనగర్‌ పోలీస్‌ కమిషనరేట్‌ వ్యాప్తంగా తనిఖీలు కొనసాగుతున్నాయి.

రామడుగు, న్యూస్‌టుడే: రామడుగు మండలం వెదిరలో అనుమానాస్పదంగా తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్నారు. ఎస్సై తాండ్ర వివేక్‌ కథనం ప్రకారం.. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో సోమవారం వెదిర రహదారిపై తనిఖీలు నిర్వహించారు. కరీంనగర్‌కు చెందిన వ్యక్తి తన కారులో రూ. 2లక్షల 2వేల నగదును తరలిస్తుండగా పట్టుకున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని