అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి

మల్లాపూర్‌, న్యూస్‌టుడే: చెర్లపల్లి కేంద్ర కారాగారంలో జీవితకాల శిక్ష అనుభవిస్తున్న ఖైదీ ఊసిరెడ్డి(71) ఆదివారం రాత్రి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు జైలు అధికారులు వెల్లడించారు. 2015లో కరీంనగర్‌ ప్రత్యేక న్యాయస్థానం.. ఇతనికి జీవితకాల శిక్ష విధించింది. అప్పటి నుంచి వరంగల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. నాలుగు నెలల క్రితం చెర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. అప్పటి నుంచి దీర్ఘకాలిక వ్యాధులతో జైలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని