కేసుల సత్వర పరిష్కారానికి కృషి
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

కేసుల సత్వర పరిష్కారానికి కృషి

మాట్లాడుతున్న జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రాణి

పెద్దపల్లి, న్యూస్‌టుడే : కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేస్తామని జూనియర్‌ సివిల్‌ జడ్జి కె.రాణి పేర్కొన్నారు. పెద్దపల్లి జూనియర్‌ సివిల్‌ కోర్టు న్యాయమూర్తిగా కె. రాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో న్యాయమూర్తి మాట్లాడుతూ.. కేసుల త్వరగా పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకారమందించాలన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సులతో గ్రామాల్లో చైతన్య సదస్సులు, లోక్‌ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ సివిల్‌ జడ్జి వరూధిని, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దాసరి రమణారెడ్డి, కార్యదర్శి లకిడి భాస్కర్‌, బొంకూరి సంతోష్‌ బాబ్జీలు పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని