మహిళపై అత్యాచార యత్నం : కేసు నమోదు
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

మహిళపై అత్యాచార యత్నం : కేసు నమోదు

జ్యోతినగర్‌, న్యూస్‌టుడే : ఎన్టీపీసీ పోలీసుస్టేషన్‌ పరిధిలోని వీర్లపల్లి శివారులో ఓ మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచార యత్నానికి పాల్పడ్డారు. ఎన్టీపీసీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్కలపల్లి గేట్‌ నుంచి వీర్లపల్లి శివారులో సోమవారం నడుచుకుంటూ వెళ్తున్న మహిళ(40)ను వెంబడించిన ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆమెను అనుసరించారు. పత్తి చేను సమీపంలోకి రాగానే అందులోకి లాక్కెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడగా, ఆమె అరుపులతో పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరాలేదని ఎన్టీపీసీ ఎస్సై స్వరూప్‌రాజ్‌ తెలిపారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని