యువకుడి దారుణ హత్య
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

యువకుడి దారుణ హత్య

వెంకటేష్‌

అగ్గిమల్ల(గొల్లపల్లి) : ఓ యువకుడిని అతి దారుణంగా గొంతుకోసి హత్య చేసిన ఘటన మండలంలోని అగ్గిమల్లలో చోటు చేసుకుంది.. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన తడవేని వెంకటేష్‌(25) గతంలో ఉపాధి నిమిత్తం దుబాయ్‌ వెళ్లి వచ్చాడు. ప్రస్తుతం స్థానికంగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. వెంకటేష్‌కు ఇదే గ్రామానికి చెందిన ఓ వివాహితతో పరిచయం ఉంది. గతంలో వీరి సంబంధం పట్ల పలుసార్లు పంచాయితీలు, కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు. వెంకటేష్‌ సోమవారం సాయంత్రం చేనుకు వెళ్లగా అక్కడే హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వెనుక వివాహేతర సంబంధమే కారణమని తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని ధర్మపురి సీఐ కోటేశ్వర్‌, ఎస్సైలు మనోహర్‌రావు, ఉపేంద్రచారి, శంకర్‌నాయక్‌ పరిశీలించారు. నిందితులు పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని