ఉత్తమ ఫలితాలే లక్ష్యం
eenadu telugu news
Published : 19/10/2021 04:53 IST

ఉత్తమ ఫలితాలే లక్ష్యం

25 నుంచి ఇంటర్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలు
మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, న్యూస్‌టుడే

మెట్పల్లి కళాశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతి

గత విద్యా సంవత్సరం కరోనా కారణంగా ప్రభుత్వం ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహించింది. వివిధ కారణాల వల్ల విద్యను అభ్యసించలేకపోయారు. విద్యాసంవత్సరం నష్టపోకూడదని ప్రభుత్వం ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులందరిని పరీక్షలు లేకుండా పైతరగతులకు ప్రమోట్ చేసింది. ఇంజినీరింగ్‌, వైద్యవిద్యతోపాటు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన విద్యాసంస్థలలో ప్రవేశం పొందాలన్నా, ఉద్యోగ పరీక్షలో అర్హత సాధించాలన్నా ఇంటర్మీడియట్లో చదివిన పాఠ్యాంశాలు ఆధారంకావడంతో ఇటీవల ఓ సంస్థ ఉద్యోగ ప్రకటనలో కరోనా కాలంలో ఇంటర్‌ చదివిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవద్దని షరతు విధించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇంటర్‌ రెండో సంవత్సరంలో చేరిన విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 25 నుంచి పరీక్షలు ప్రారంభమవుతుండడంతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుండగా అధ్యాపకులు ప్రత్యేక తరగతులు తీసుకుంటూ సందేహాలు నివృత్తి చేస్తూ సన్నద్ధం చేస్తున్నారు. పరీక్షలకు సన్నద్ధమవుతున్న మెట్పల్లి, ఇబ్రహీంపట్నం కళాశాలల విద్యార్థులను ‘న్యూస్‌టుడే’ పలకరించింది.


ఆన్‌లైన్‌ తరగతులు ఉపయోగం
-సీహెచ్‌.రవీన, ఎంపీˆసీˆ, ఇబ్రహీంపట్నం

నేను ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రథమ సంవత్సరం పరీక్షల కోసం నిత్యం ఎంతో కష్టపడి చదువుతున్నాను. రెండో సంవత్సరం చదువుతూ ప్రథమ సంవత్సరం పరీక్షలు రాయాలంటే కాస్త కష్టమే. అయినా అధ్యాపకుల సలహాలు, సూచనలతో పరీక్షలకు సన్నద్ధమవుతున్నాను. గత ఏడాది ఆన్‌లైన్‌ తరగతులు, కళాశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఎంతో ఉపయోగపడుతున్నాయి.


ప్రణాళికతో ముందుకు
-లవంగ వంశీ, బైసీసీ, మెట్పల్లి

మెట్పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో బైపీˆసీˆ రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రథమ సంవత్సరం పరీక్షల కోసం ప్రణాళికతో చదువుతున్నాను. రెండో సంవత్సరం తరగతులకు హాజరవుతున్నాను. సమయం తక్కువ ఉండడంతో ప్రతి సబ్జెక్టుకు కొంత సమయం కేటాయిస్తున్నాను. అధ్యాపకుల సలహాలు, సూచనలతో పరీక్షలకు అన్ని విధాల సన్నద్ధమవుతున్నాను. మంచి మార్కులు తప్పక సాధిస్తాను. కళాశాలలో నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.


సందేహాలు నివృత్తి చేసుకుంటూ..
-చేని అక్షయ, సీˆఈసీˆ, మెట్పల్లి

మెట్పల్లి జూనియర్‌ కళాశాలలో సీˆఈసీˆ రెండో సంవత్సరం చదువుతున్నాను. ప్రథమ సంవత్సరంలో మంచి మార్కులు సాధించడమే లక్ష్యం. ప్రతి సబ్జెక్టును రెండు మూడు పర్యాయాలు చదువుతున్నాను. సందేహాలను ఎప్పటికప్పుడు అధ్యాపకులతో నివృత్తి చేసుకుంటున్నాను. నిత్యం ఉదయం సాయంత్రం నాలుగు గంటలు చదువుకు కేటాయిస్తున్నాను. ప్రత్యేక తరగతులకు హాజరవుతున్నాను. మొదటి సంవత్సరంలో నిర్వహించిన ఆన్‌లైన్‌ క్లాసులు ఉపయోగపడుతున్నాయి.


సమయం సద్వినియోగం
-రమాకాంత్‌, ఎంపీసీ, ఇబ్రహీంపట్నం

రెండో సంవత్సరానికి ప్రమోట్ కావడంతో విద్యార్థుల దృష్టి అంతా ద్వితీయ సంవత్సరం పాఠ్యాంశాలపైనే పెట్టారు. ఇప్పుడు పరీక్షలని చెప్పడంతో విద్యార్థులు గందరగోళానికి గురవుతున్నారు. సిలబస్‌ తగ్గించినా అన్ని పాఠ్యాంశాలు చదవడం అనుకున్నంత సులువు కాదు. తక్కువ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాధ్యమైనంత వరకు కష్టపడి చదువుతున్నాం, అధ్యాపకులతో సందేహాలు నివృత్తి చేసుకుంటున్నాం. మంచి మార్కులు సాధిస్తాం.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని