దళితబంధుపై అనుమానాలు వద్దు
eenadu telugu news
Published : 20/10/2021 03:01 IST

దళితబంధుపై అనుమానాలు వద్దు

మంత్రి హరీశ్‌రావు

జమ్మికుంటలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: ఉప ఎన్నిక తరువాత దళిత బంధు తప్పకుండా ఇస్తామని దీనిపై ఎవరికీ అనుమానాలు వద్దని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జమ్మికుంట మున్సిపల్‌ పరిధి ఆబాది జమ్మికుంటలోని ఓ కాటన్‌ మిల్లులో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ నాయకులు కసుబోజుల వెంకన్న, సలీం, నాగేంద్ర, శ్రీనివాస్‌లతో పాటు పలువురు తెరాసలో చేరగా మంత్రి హరీశ్‌రావు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాజపా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడైనా తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో ఉన్న బొగ్గును పక్క రాష్ట్రాలకు పంపే కుట్రలను కేంద్ర ప్రభుత్వం చేస్తుందన్నారు. మాణికం ఠాగూర్‌ భాజపాతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌, మున్సిపల్‌ ఛైర్మన్‌ తక్కళ్లపల్లి రాజేశ్వర్‌రావు, తెరాస పట్టణ అధ్యక్షుడు టంగుటూరి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని