ఒకే వాహనంపై 79 చలాన్లు
eenadu telugu news
Published : 20/10/2021 03:22 IST

ఒకే వాహనంపై 79 చలాన్లు

గోదావరిఖని, న్యూస్‌టుడే : ఒకే వాహనంపై 79 చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. వాహన తనిఖీల్లో భాగంగా స్థానిక ఎఫ్‌సీఐ అడ్డరోడ్డు వద్ద ట్రాఫిక్‌ ఎస్‌ఐ నాగరాజు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా ఏపీ15బీఎన్‌ 1695 నంబరు గల వాహనంపై పెండింగ్‌ చలాన్లు 79 ఉన్నట్లు గుర్తించారు. మొత్తం రూ.17,400 జరిమానా చెల్లించాల్సి ఉండటంతో వాహనదారునితో మాట్లాడి వాటిని చెల్లించిన తర్వాతనే వాహనాన్ని తీసుకెళ్లాలని ఎస్‌ఐ తెలిపారు. దీంతో అతను కొంత మొత్తం చెల్లించాడు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని