చికిత్స పొందుతూ విద్యుత్తు ఉద్యోగి మృతి
eenadu telugu news
Published : 20/10/2021 03:22 IST

చికిత్స పొందుతూ విద్యుత్తు ఉద్యోగి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడి  ఏడాది పాటు కోమాలోనే..

కిష్టస్వామి

పెద్దపల్లి, న్యూస్‌టుడే: ఏడాది కిందట రోడ్డు ప్రమాదంలో గాయపడిన విద్యుత్తు సంస్థ ఉద్యోగి చికిత్స పొందుతూ మృతి  చెందారు. కరీంనగర్‌కు చెందిన వడ్లకొండ కిష్టస్వామి(51) పెద్దపల్లి గ్రామీణ తూర్పు సెక్షన్‌లో లైన్‌ఇన్‌స్పెక్టర్‌గా పని చేసేవారు. గత సంవత్సరం అక్టోబరు 2న హైదరాబాద్‌ నుంచి కారులో వస్తుండగా కరీంనగర్‌ సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న వారు కొద్ది రోజులకే కోలుకున్నారు. తీవ్రంగా గాయపడిన కిష్టస్వామి కోమాలోకి వెళ్లిపోయారు. అప్పటి నుంచి కరీంనగర్‌, హైదరాబాద్‌లలోని పలు ఆసుపత్రుల్లో అందించారు. కాగా వైద్యానికి శరీరం సహకరించకపోవడంతో కొంతకాలంగా కరీంనగర్‌లోని నివాసంలోనే చికిత్స అందిస్తున్నారు. సోమవారం రాత్రి కిష్టస్వామి మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు విద్యుత్తు ఉద్యోగులు, 327 యూనియన్‌ నాయకులు సంతాపం ప్రకటించారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని