జిల్లా ఆసుపత్రిలో ఒకే రోజు 27 ప్రసవాలు
eenadu telugu news
Published : 20/10/2021 03:31 IST

జిల్లా ఆసుపత్రిలో ఒకే రోజు 27 ప్రసవాలు

నవజాత శిశువులతో బంధువులు, పక్కన వైద్యులు

జగిత్యాల పట్టణం, న్యూస్‌టుడే : జగిత్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో 24 గంటల్లో 27 ప్రసవాలు చేశారు. ఇందులో 9 సాధారణ ప్రసవాలు కాగా 14 శస్త్రచికిత్సలు జరిగాయి. ఏడాదిన్నరలో జిల్లా ఆసుపత్రిలో ఒకే రోజు 25కుపైగా ప్రసవాలు నమోదు కావడం ఇది మూడోసారని మంగళవారం ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. ప్రసవానంతరం తల్లులు, పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని గైనకాలజిస్టులు వొడ్నాల రజిత, వినీల, శిరీష తెలిపారు. జిల్లా ఆసుపత్రిలో ప్రసవాల సంఖ్య పెరుగుతుండటంతో మరో గైనకాలజిస్టు నియామకం చేపట్టాలని వైద్యులు ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ను కోరారు.

 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని