బృహత్‌ పల్లె ప్రకృతి వనం చుట్టూ బయో ఫెన్సింగ్‌
eenadu telugu news
Published : 20/10/2021 03:31 IST

బృహత్‌ పల్లె ప్రకృతి వనం చుట్టూ బయో ఫెన్సింగ్‌

సారంపల్లిలో పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అధికారులు

తంగళ్లపల్లి, న్యూస్‌టుడే: బృహత్‌ పల్లె ప్రకృతి వనం చుట్టూ బయో ఫెన్సింగ్‌ ఏర్పాటు చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. మంగళవారం తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో 10 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేస్తున్న బృహత్‌ పల్లె ప్రకృతి వనాన్ని అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో మొక్కలకు నీటిని అందించేందుకు ప్రభుత్వ నిధుల ద్వారా బోర్‌, పంపు సౌకర్యం కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇప్పటి వరకు బృహత్‌ పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాలకు చెందిన 31 వేల మొక్కలను నాటడం జరిగిందని తెలిపారు. వాటి సంరక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు డీఆర్‌డీవో కౌటిల్యరెడ్డి తెలిపారు.

వ్యాక్సినేషన్‌ రెండో డోస్‌ ప్రక్రియపై దృష్టి
తంగళ్లపల్లి మండలంలోని మండేపల్లి, జిల్లెల్ల గ్రామ పంచాయతీల్లోని కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. వ్యాక్సినేషన్‌ చేస్తున్న తీరును పరిశీలించారు. క్షేత్రస్థాయిలో ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే జిల్లా యంత్రాంగానికి తెలియజేయాలన్నారు. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ రెండో డోస్‌పై సంబంధిత అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. అర్హులైన వారి జాబితాను సేకరించి టీకా వేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌, డీఆర్‌డీఓ కౌటిల్యరెడ్డి, ఏపీడీ మదన్‌మోహన్‌, ఎంపీఓ వెంకటేశ్వర్లు, ఏపీఓ నాగరాజు, వైద్యాధికారిణి సుప్రియ, సర్పంచులు గణప శివజ్యోతి, కొయ్యాడ రమేశ్‌, మాట్ల మధు, తదితరులు పాల్గొన్నారు.


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని