పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

పారిశుద్ధ్యం మెరుగుపర్చాలి

తనిఖీ చేస్తున్న అదనపు కలెక్టర్‌ అరుణశ్రీ

జగిత్యాల, న్యూస్‌టుడే: పట్టణాల్లో పారిశుద్ధ్యం మెరుగుపర్చాలని జిల్లా అదనపు కలెక్టర్‌ జె.అరుణశ్రీ ఆదేశించారు. శనివారం జిల్లా కేంద్రంలోని 29, 31, 43 వార్డుల్లో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు. కొవిడ్‌ టీకా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుద్ధ్యం మెరుగుపర్చడంలో నిర్లక్ష్యం చూపవద్దని రహదారులు, మురుగుకాలువలు ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు. కొవిడ్‌ టీకా కేంద్రాల్లో సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. టీకాలో వేగం పెంచాలని ఇంటింటికి సర్వే జరిపి అర్హులైన వారందరికి టీకా ఇవ్వాలన్నారు. పురపాలక కమిషనర్‌ స్వరూపరాణి తదితరులున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని