ఎన్నికల కోడ్‌ అమలుకు అదనపు బృందాలు
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

ఎన్నికల కోడ్‌ అమలుకు అదనపు బృందాలు

కరీంనగర్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: జిల్లాలో ఉప ఎన్నికల ప్రవర్తన నియమావళిని పక్కాగా అమలు చేయడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, పాలనాధికారి ఆర్వీ కర్ణన్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకోసం అదనంగా 5 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 5 స్టాటిక్‌ సర్వెలెన్స్‌ టీంలతో పాటు వీడియో సర్వెలెన్స్‌, వ్యూయింగ్‌, సహాయ వ్యయ పరిశీలకుడు, అకౌంటింగ్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గం పరిధిలో వివిధ రాజకీయ పార్టీల సభలు, సమావేశాలు, రోడ్‌ షోలు, ప్రచార సరళిని నిశితంగా పరిశీలిస్తూ, అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను లెక్కిస్తారని పేర్కొన్నారు.

గట్టి నిఘా

ఉప ఎన్నికల కోడ్‌ అమలుపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నిల అధికారి, పాలనాధికారి ఆర్‌వీ కర్ణన్‌ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన ఎన్నికల వ్యయ పరిశీలకులు సుబోద్‌ సింగ్‌ స్థానిక ఆబ్కారీ విశ్రాంత భవనంలో ఉంటున్నారని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనకు సంబంధించిన అన్ని ఫిర్యాదులను స్వయంగా ఆయన స్వీకరించడంతో పాటు, తగు చర్యలు తీసుకుంటారని తెలిపారు. ఎన్నికల వ్యయ పరిశీలకుడితో నేరుగా మాట్లాడాలనుకునే వారు 63014 76329 నంబర్‌కు ఫోన్‌ చేయచ్చని తెలిపారు. ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదులను అన్ని రాజకీయ పార్టీల నాయకులు, ప్రతినిధులు ఫోన్‌ ద్వారా తెలియజేసే అవకాశం ఉందని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని