ఉపఎన్నిక.. ప్రజలు కోరుకున్నది కాదు
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

ఉపఎన్నిక.. ప్రజలు కోరుకున్నది కాదు

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి

కాంగ్రెస్‌ అభ్యర్థి వెంకట్‌కు ఓటెయ్యాలని కోరుతున్న రేవంత్‌రెడ్డి

వీణవంక, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నిక ప్రజలు కోరుకుంటే వచ్చినవి కాదని సీఎం కేసీఆర్‌, ఈటల రాజేందర్‌ మధ్య పంపకాల పంచాయతీతో వచ్చిన ఎన్నికలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం వీణవంక మండల కేంద్రంలో మండల ఇన్‌ఛార్జి ఆది శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు...తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం కాంగ్రెస్‌ తెలంగాణ ఇస్తే ఏడేళ్లలో పేద వారికి ఏం వచ్చిందో చెప్పాలన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా తెరాస నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని అన్నారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ ఏర్పడ్డాక ఆశించిన ఫలాలు అందక నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, అలాంటి తెరాస పార్టీని ఓడించాలని అన్నారు. ఉద్యమకారుడు వెంకట్‌ను గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో శ్యాంసుందర్‌రెడ్డి, నల్ల కొండల్‌రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీలు మల్లు రవి, పొన్నం ప్రభాకర్‌, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మండల ఇన్‌ఛార్జి ఆది శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ సమాజాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబసభ్యులు దోచుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. జమ్మికుంట పట్టణంలోని వీణవంక రోడ్డులో శనివారం సాయంత్రం కాంగ్రెస్‌ అభ్యర్థి బల్మూరి వెంకట్‌తో కలిసి ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు.

అనంతరం గాంధీచౌక్‌ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ....కేసీఆర్‌, హరీశ్‌రావుల మాయమాటలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థి బల్కూరి వెంకట్‌ మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించడంలో భాజపా, తెరాస దొందూ...దొందేనన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు,  ఈర్ల కొమురయ్య పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని