హుజూరాబాద్‌ను అందంగా తీర్చిదిద్దుతా
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

హుజూరాబాద్‌ను అందంగా తీర్చిదిద్దుతా

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు

ధూంధాంలో మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు చిత్రంలో తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: సిద్దిపేట్‌- కరీంనగర్‌ తరహాలో హుజూరాబాద్‌ను అందంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శనివారం హుజూరాబాద్‌లో ధూంధాం కార్యక్రమానికి హాజరయ్యారు. తెరాస ప్రభుత్వాన్ని ఆశీర్వదించి అండగా నిలవాలని కోరారు. తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ సేవచేసే అవకాశాన్ని తనకు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌ గందె రాధిక తదితరులు పాల్గొన్నారు.

మంత్రి గంగుల ప్రచారం

హుజూరాబాద్‌లో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌  శనివారం తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ తరపున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. పలు వీధులగుండా తిరిగి ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ హుజూరాబాద్‌ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తారో భాజపా నేతలు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. దళిత బంధు పథకానికి భాజపా నాయకులు అడ్డుపడటం నిజం కాదా అని ప్రశ్నించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని