తెలంగాణ తల్లి గడీల్లో బందీ
eenadu telugu news
Published : 24/10/2021 04:29 IST

తెలంగాణ తల్లి గడీల్లో బందీ

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

జమ్మికుంట ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న బండి సంజయ్‌

జమ్మికుంట, జమ్మికుంట గ్రామీణం, న్యూస్‌టుడే: తెలంగాణ తల్లి గడీల్లో బందీ అయ్యిందని.. భాజపా కార్యకర్తలు కాషాయ జెండాలు చేతబట్టి గడీలు బద్దలు కొట్టేందుకు సిద్ధం కావాలని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని మోత్కులగూడెం చౌరస్తా నుంచి కొత్తపల్లి చౌరస్తా వరకు భాజపా అభ్యర్థి ఈటలకు మద్దతుగా శనివారం సాయంత్రం ఎన్నికల ప్రచార ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ...మిల్లర్లతో కుమ్మక్కైన కేసీఆర్‌ కమీషన్లు రావడం లేదనే అక్కసుతో వరివేస్తే ఉరే అని భయపెడుతున్నారని అన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించిన పాపానికి తెలంగాణ ఉద్యమకారుడైన ఈటల రాజేందర్‌ను తెరాస నుంచి బయటకు పంపారని అన్నారు.  ఈ కార్యక్రమంలో ఈటల జమున, భాజపా జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎర్రబెల్లి సంపత్‌రావు, జీడి మల్లేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

లక్ష్యానికి అనుగుణంగా వ్యాక్సిన్‌ పంపిణీ

జమ్మికుంట: దేశంలో వంద కోట్ల డోసుల కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చిన ఘనత కేంద్రంలోని ప్రధాని మోదీ ప్రభుత్వానిదే అని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. జమ్మికుంట మున్సిపల్‌ పరిధిలోని కొత్తపల్లిలో శనివారం రాత్రి జరిగిన ఉప ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. అందరికీ టీకా అందజేస్తున్న ప్రధానికి కృతజ్ఞతలు తెలిపేందుకు అందరూ సెల్‌ఫోన్లలో టార్చిలైట్లు ఆన్‌చేయాలని సూచించగా అక్కడ ఉన్నవారు సెల్‌ఫోన్లలో టార్చిలైట్లను ఆన్‌చేసి ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో యూరియాపై కేంద్రం ఇస్తున్న రాయితీ వివరాలను తెలుపుతూ ఎరువు బస్తాల సంచులను ఎంపీ చూపించారు.

టీకా విజయవంతంతో కొత్తపల్లిలో చరవాణి వెలుగులతో సంఘీభావం


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని