600 క్వింటాళ్లపత్తి దగ్ధం
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

600 క్వింటాళ్లపత్తి దగ్ధం


మంటలను అదుపులోకి తీసుకొస్తున్న అగ్నిమాపక సిబ్బంది

జమ్మికుంట, న్యూస్‌టుడే :  కరీంనగర్‌ జిల్లా జమ్మికుంటలోని మురుగన్‌ కాటన్‌ జిన్నింగ్‌ మిల్లులో మంగళవారం అగ్నిప్రమాదం  సుమారు 600 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్థమైంది. మిల్లు ఆవరణలోని పత్తిని హాట్‌బాక్స్‌ యంత్రానికి తరలిస్తుండగా, వచ్చిన నిప్పురవ్వలతో ప్రమాదం జరిగినట్లు  యజమాని బచ్చు భాస్కర్‌ చెప్పారు. సమాచారం అందిన స్థానిక అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది మంటలను ఆర్పారు.  ప్రమాదం జరిగిన కొద్దిదూరంలో ఉన్న  పత్తి, మిల్లులో నిల్వ చేసిన బేళ్లకు నష్టం జరుగలేదు. ప్రమాదానికి స్పష్టమైన కారణాలు తెలియలేదని అగ్నిమాపక అధికారి శ్రీనివాస్‌ చెప్పారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని