డెంగీతో బాలిక మృతి
eenadu telugu news
Published : 27/10/2021 04:17 IST

డెంగీతో బాలిక మృతి

మల్యాల, న్యూస్‌టుడే : మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన 9వ తరగతి చదివే సాహిత్య(14) అనే విద్యార్థి వారం రోజుల క్రితం డెంగీ బారినపడి హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సాహిత్య తండ్రి గంగాధర్‌ స్కూల్‌ అసిస్టెంటుగా, తల్లి రాధ గృహిణిగా పనిచేస్తున్నారు. వారం రోజుల క్రితం డెంగీ బారినపడ్డ సాహిత్యను తల్లిదండ్రులు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నప్పటికీ పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని