రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు
eenadu telugu news
Published : 27/10/2021 04:35 IST

రోడ్డు ప్రమాదంలో 20 మందికి గాయాలు


సంఘటన స్థలంలో గాయపడ్డ మహిళలు

హుజూరాబాద్‌ పట్టణం, గ్రామీణం, న్యూస్‌టుడే: కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌-జమ్మికుంట ప్రధాన రహదారిపై రాజపల్లి సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుమారు 20 మందికిపైగా గాయాలయ్యాయి. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్‌ కాలనీకి చెందిన పలువురు ట్రాలీ ఆటోలో హుజూరాబాద్‌ వైపునకు వెళుతున్నారు. గ్రామ సమీపంలో వీరి ట్రాలీఆటోను హుజూరాబాద్‌ వైపు వెళుతున్న లారీ వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్థితి విషమంగా మారటంతో చికిత్స నిమిత్తం వరంగల్‌కు తరలించారు. వీరంతా హుజూరాబాద్‌లో జరిగే తెరాస సమావేశానికి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.

మంత్రి గంగుల పరామర్శ
క్షతగాత్రులను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజు, తెరాస అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, కరీంనగర్‌ మేయర్‌ సునీల్‌రావులు పరామర్శించారు. ఏరియా ఆసుపత్రి ఆర్‌ఎంవో డాక్టర్‌ రమేష్‌ను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వైద్య చికిత్సలపై ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఆరా తీశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని