హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయజెండానే
eenadu telugu news
Published : 27/10/2021 04:35 IST

హుజూరాబాద్‌లో ఎగిరేది కాషాయజెండానే

మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు

మాట్లాడుతున్న మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, వేదికపై భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్‌చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

హుజూరాబాద్‌, న్యూస్‌టుడే: హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో కాషాయజెండా ఎగరడం ఖాయమని మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. యావత్‌ తెలంగాణతో సహా ప్రపంచమంతా ఈటల రాజేందర్‌ గెలుస్తారని అంటున్నారని చెప్పారు. స్థానిక మధువని గార్డెన్‌లో భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్‌చుగ్‌, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పాల్గొన్న హుజూరాబాద్‌ పుర ప్రముఖుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడారు. ఆత్మగౌరవం కోసం తెరాసను వదిలిన ఈటల రాజేందర్‌ భాజపాలో చేరి మంచిపని చేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జలశక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకుంటే మిషన్‌ భగీరథ నిధులు వృథా అయ్యేవి కావన్నారు. భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్‌చుగ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నియంత పాలనతో బంగారు తెలంగాణ కలగానే మిగిలిందన్నారు. ఆంధ్రాలో ప్రాజెక్టులు కడుతున్నా కేసీఆర్‌ పట్టించుకోలేదన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గుజ్జుల రామకృష్ణారెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, భాజపా నేతలు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, ఎస్‌.కుమార్‌, జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పాల్గొన్నారు.

భాజపా మేనిఫెస్టో విడుదల
హుజూరాబాద్‌ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో అమలు చేయనున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలతో కూడిన మేనిఫెస్టోను భాజపా రాష్ట్ర ఇన్ఛార్జి తరుణ్‌చుగ్‌ మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో నియోజకవర్గాన్ని ప్రగతి పథంలో నడిపిస్తామని చెప్పారు. నియోజకవర్గంలోని రైల్వేస్టేషన్ల అభివృద్ధి, రైల్వేఓవర్‌ బ్రిడ్జిలు, అండర్‌ బ్రిడ్జిల నిర్మాణంతో పాటు జమ్మికుంట రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరిస్తామని చెప్పారు. పలు అంశాలను వివరించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని