కరోనా మందగమనం
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

కరోనా మందగమనం

చేయి చేయి కలిపి.. కరోనాను తరిమివేసేందుకు కలబురగిలో మంగళవారం నిర్వహించిన చైతన్య

ప్రదర్శన.. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌.అశోక్‌ నేతృత్వంలో సర్వమతాల

ప్రముఖులూ పాల్గొని టీకాపై అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు..

బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్‌టుడేే : కట్టడి చర్యలు తీవ్రం కావడంతో కర్ణాటకలో కరోనా తగ్గుముఖం పడుతోంది. మంగళవారం కేవలం 349 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. చికిత్స అనంతరం 399 మంది కోలుకుని ఇళ్లకు తిరిగి వెళ్లారు. చికిత్స పొందుతూ 14 మంది మరణించారు. ఫలితంగా క్రియాశీల కేసుల సంఖ్య 9100కు తగ్గాయి. పాజిటివిటీ 0.41 శాతానికి, మరణాలు 4.01 శాతంగా నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా 1.15 లక్షల మంది మంగళవారం టీకా వేయించుకున్నారు. మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద 85,022 మందికి ఆర్‌.టి.పి.సి.ఆర్‌. పరీక్ష నిర్వహించారు.

కొవిడ్‌ బారిన పడి, చికిత్స అనంతరం కోలుకున్న వారు ఇతర వ్యాధులతో బాధలు ఎదుర్కొంటున్నారు. కోలుకున్న వారు పౌష్ఠిక ఆహారాన్ని, రోగ నిరోధక శక్తిని పెంపొందించేందుకు చర్యలు, సరైన వ్యాయామం లేని వారిలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. గుండెపోటు బారిన పడుతున్న వారి సంఖ్యా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గుండె పోటుకు గురవుతున్న వారికి తక్షణ ప్రథమ చికిత్స అందించేందుకు సి.పి.ఆర్‌. శిక్షణ ఇచ్చేందుకు కొవిడ్‌ ఇండియా క్యాంపెయిన్‌ సంస్థ స్వచ్ఛందంగా ముందుకు వచ్చింది. కృత్రిమ శ్వాస, ఇతర ఔషధాల ద్వారా బాధితులకు శిక్షణ అందించేందుకు ముందుకు వచ్చిన సంస్థకు మద్దతుగా ఆశా కార్యకర్తలు, ఆరోగ్య సిబ్బంది, విద్యార్థులు, పోలీసులకు ఎక్కువ సంఖ్యలో శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై తెలిపారు. సంస్థ ఇప్పటికే 4,250 మందికి శిక్షణ ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రాథమిక చికిత్సల గురించి అవగాహన కల్పించేందుకు పూర్తి సహకారాన్ని అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని