కోళ్ల ఫారంలో చిరుత!
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

కోళ్ల ఫారంలో చిరుత!

మైసూరు, న్యూస్‌టుడే : కోళ్ల ఫారంలోకి ప్రవేశించిన చిరుతను చాకచక్యంగా బంధించిన సంఘటన మంగళవారం నగరానికి సమీపంలోని జయపురలో చోటుచేసుకుంది. దాన్ని అటవీ సిబ్బంది బంధించి తీసుకెళ్లారు. జయపుర గ్రామానికి చెందిన బసప్ప అనే రైతుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలోని కోళ్లఫారంలోకి చిరుత అడుగులు వేసింది. అక్కడి నాటుకోళ్లను సుష్టుగా భుజించింది. మంగళవారం తెల్లవారుజామున 4.45 గంటల సమయంలో కోళ్లను చూసేందుకు బసప్ప అక్కడికి వెళ్లి చూడగా చిరుత నిద్రిస్తున్న విషయాన్ని గుర్తించి వెంటనే తలుపుల్ని బంధించారు. అటవీశాఖకు సమాచారాన్ని అందించడంతో దాని ఆట కట్టినట్లయ్యింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని