మిన్నంటేలా.. కన్నడ ఢంకా!
eenadu telugu news
Published : 20/10/2021 01:48 IST

మిన్నంటేలా.. కన్నడ ఢంకా!


గోడ పత్రికను ప్రదర్శిస్తున్న మంత్రి, అధికారులు, కన్నడ అభివృద్ధి, గడి ప్రాధికారల అధ్యక్షులు

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడేే : ప్రతి ఒక్కరూ తమ నిత్య జీవితంలోని వ్యవహారాలను కన్నడలోనే కొనసాగించాలని కన్నడ, సంస్కృతి శాఖ మంత్రి వి.సునీల్‌ కుమార్‌ పిలుపునిచ్చారు. వివిధ సంస్థల్లో విధి నిర్వహణకు సంబంధించిన అంశాలు మినహా.. సాధ్యమైనంత వరకు కన్నడ మాట్లాడేందుకు ప్రయత్నించాలని సూచించారు. రాజ్యోత్సవాలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా కన్నడను ప్రోత్సహించేందుకు ఈ నెల 24 నుంచి 31 వరకు ‘మాతాడ్‌.. మాతాడ్‌ కన్నడ’ పేరిట ప్రజా జాగృతి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఈ అంశానికి సంబంధించిన గోడ పత్రికను ఆయన మంగళవారం విడుదల చేసి మాట్లాడారు. అక్టోబరు 28న ఉదయం 11 గంటలకు రాష్ట్ర వ్యాప్తంగా లక్ష గొంతులతో ఒకేసారి ‘బారిసు కన్నడ డిండిమవ’, ‘జోగద సిరి బెళకినల్లి’, హుట్టిదరె కన్నడ నాడల్లి హుట్టబేకు’ పాటలను ఆలపించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
తాజా వార్తలు
మరిన్ని